Skip to main content

Posts

Featured

                                                                మనోజ్ రామ్ తలుపులు వేసి ఉన్నాయి . ఆ మూసినా తలుపులవైపు చూస్తూ అలా నిలబడి పోయింది నీరజ      తప్పదు .... కదలాలి ! ఆ తలుపులు తట్టాలి !      శక్తినంతా కూడదీసుకుని నడిచింది - తలుపు తట్టింది .     " ఎవరు ?" అని విసుగ్గా వినిపించింది . వర్దనిస్వరం - ఒక్కనిముషం తర్వాత తలుపులు తెరుచుకున్నాయి .      నీరజనుచూసి నిర్ఘాంతపోయింది వర్ధని .     " నువ్వు .... నువ్వు ..." అంది .     " వచ్చేసాను పిన్నీ ! బయటపడి వచ్చేసాను !"      పొంగివస్తోంది ఏడుపు నీరజకి - కానీ మరొకరిముందు ఏడవటం నీరజకు అలవాటులేదు . వర్ధనిముందు అసలు ఏడవదు .      వర్ధని ఏంమాట్లాడలేదు . దెయ్యాన్ని చూస్తున్నట్లు నీరజను చూస్తూ నిలుచుంది - లోపలకు రమ్మనికూడా అనలేదు - నీరజ తనే లోపలకు నడిచింది . ...

Latest posts